Friday, December 30, 2011

భారతీయులం...















తెలివిలేక నాడు మేము
తెల్లవాడికి భానిసయ్యాం
కన్న భూమిని చెరనబెట్టి
కునుకు తీస్తు కూర్చున్నాం
తెల్లవాడికి తొత్తులమై
తల్లి సొత్తును తరలించాం
తెల్లవాడు తంతుంటే
తిరగభాటు నేర్చుకున్నాం
తప్పదని తెల్లోడికెదురుగ
తిరుగుభాటు మొదలు పెట్టాం
తేరుకుని చూసెలోపే
తెల్లవాడికి దోచిపెట్టాం
బిడ్డలందరం ఒక్కటైనాం
భరతమాతే కావలన్నాం
తెల్లవాడిని తరిమికొట్ట
తిప్పలెన్నో మేముపడ్డాం

గడప వీడి పోకముందే
గొడవ పడి వీడిపోయాం
పరాయోడిని పారధ్రోలి
పారతంత్ర్యం మేమొదిలాం
పారతంత్ర్యం వదిలి మేము
పాపతంత్ర్యం పయనమయ్యాం
కటిక చీకటి దారినొదలి
కాళరాత్రి వైపు మల్లాం
పేదరికం పెంచుకుంటు
పసివాడి తీరుగ అడుగులేసాం
మధ్యలో యుద్ధాల పేరుతొ
మా నడ్దిని విరుచుకున్నాం
మానవత్వం మరిచిపోయాం
మావారిని దూరముంచాం
కులం మతం పేరుచెప్పి
కయ్యాలని పెంచుకున్నాం

మాలొమేము తన్నుకుంటు
మూర్ఖులుగా మిగిలున్నాం
రౌడీలమే రాజులుగా
రాజ్యమేలుట మొదలెట్టాం
అక్రమాలకు ఆనవాలై
అవినీతికి నెలువయ్యాం
అప్పులేమొ పెంచుకుంటూ
అభివృద్ధిని జపం చేసాం
సంస్కరణల పేరుతోటి
చావు దెబ్బ మేముతిన్నాం
పల్లెటూలని కాళరాస్తు
పట్టణాలని ముస్తాబు చేశాం
జనాభాని పెంచుకుంటు
జగతిలోనా ద్వితియగున్నాం
తల్లి భారతి ప్రగతికేమో
తల కొరివి మేముపెట్టాం

-రమేష్

Friday, November 25, 2011

ప్రత్తి రైతు




చెర్నాకోల చేతి నుంది
చద్దిమూట భుజానుంది
చిక్కిపోయి దేహముంది
చావుకల మొహానుంది

బీడుపడి పొలముంది
బిక్కమొహం రైతుకుంది
బ్రతుకు భారమయ్యింది
భాదేమొ పెరిగింది

మబ్బుపట్టి మేఘముంది
మంచు గాలి తాకింది
మబ్బు కరిగి పొయింది
మంచి వాన కురిసింది

రైతు మనసు మురిసింది
రాత్రి నిద్ర పట్టింది
రేయి గడిచి పొయింది
రేపటెలుగు వచ్చింది

హలం తను కదిలింది
హోరెత్తి దున్నింది
హడావిడె పెరిగింది
హాయితొ పుడమి మురుసింది

ప్రత్తి మొలకెత్తింది
పరువు నిలుపుతానంది
పచ్చగానె పైరుంది
పంటమీదె ఆశుంది

చినుకు కరువాయింది
చిన్న బావి ఎండింది
చేను వాడి పోయింది
చింతేమొ మిగిలింది

ఆడ పిల్ల ఎదిగింది
అమ్మేమొ మూల్గుతుంది
అయ్య చేసినప్పుంది
అప్పేమొ పెరుగుతుంది

పరువు పేచి పెట్టింది
పిల్ల పెళ్ళి ముందరుంది
పైసకూడ పుట్టకుంది
పుట్టెడంత భాదుంది

పైరుకేమొ పురుగుంది
పంట చేతి కందనంది
పురుగు మందు చెంత నుంది
ప్రత్తి రైతు శవముంది
-రమేష్