Thursday, June 5, 2008

నివేదన...


ఓ ప్రేయసీ ప్రియసఖి నా ప్రేమ చూడవె
నినునేను కోరి నను నేను మరిచానె
మదిలోని నీ రూపు మరువ లేకున్నానె
యెదలోని నా ప్రేమ యెటుల నే తెలుపనె
కలలెన్నో కంటూనె కునుకు రాదాయె
యెదలోని నీ ఊసు మాసిపోదాయె
కవ్వించే నీ చూపు కుచ్చుకుంటుందే
తప్పుకుందామంటె తిప్పలవుతుందే
గుండెలో నీ రూపు గూడుకట్టిందె
గుండేమో ఆ గూడు తీయనంటుందె
మనసేమో నీ తలపు మరవనంటుందె
మనసు తలుపు నిను తెరువమంటుందె
కనులేమో నీ రూపు నెమరు వేస్తున్నాయె
కను పాప నీవై కొలువుండి పోవెమె
గుండెలో ఊసులేవో గుప్పుమంట్టూన్నాయే
పంచడానికి నిను పిలవమంట్టూన్నవె
జోడు కోసం ఈడు గోల పెడుతుందె
మాటేమో కరువై మదన పడుతుందే
ప్రతి రోజు నువులేక ఉండనంటుందె
పాపనై నీ ఒడిని చేరమంటుందే.
-రమేష్

Wednesday, June 4, 2008

నీ స్నేహం...


కన్నీటి సుడిగుండంలో చిక్కుకుని
కలత చెందినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

ధైన్యంలొ కూరుకొని
దీనంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

చీకటంత అలుముకుని
శూన్యంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

గాయాలకు తాలలేక
గమ్యాన్ని మరిచినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

మౌనంలొ మునిగిపోయి
మదన పడినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

ఎన్నని చెప్పను నేస్తం....
నన్ను నడిపిన నీ గూర్చి
తెలుసా నేస్తం.... నీ స్నేహం నా పాలిట వరం.
-రమేష్