Wednesday, June 4, 2008

నీ స్నేహం...


కన్నీటి సుడిగుండంలో చిక్కుకుని
కలత చెందినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

ధైన్యంలొ కూరుకొని
దీనంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

చీకటంత అలుముకుని
శూన్యంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

గాయాలకు తాలలేక
గమ్యాన్ని మరిచినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

మౌనంలొ మునిగిపోయి
మదన పడినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

ఎన్నని చెప్పను నేస్తం....
నన్ను నడిపిన నీ గూర్చి
తెలుసా నేస్తం.... నీ స్నేహం నా పాలిట వరం.
-రమేష్

6 comments:

MRVijayTillu said...

super

రమేష్ said...

Thanks for your comment Vijay!!

HARI216 said...

Na manasantha nee kavithala parimalamalo payaninchindhi nee kavithalu chadhivinaaka

HARI216 said...

HiFriend i need your support

రమేష్ said...

థాంక్స్ HARI12 గారు!! మీ కామెంట్ చూస్తె మీరు కవితలు వ్రాస్తారు అనిపిస్తుంది!! tell me what kind of support you need.

Bhavani said...

Telugu kavithalu bagunnai spelling mistakes lekapote inka bagundu