Wednesday, July 30, 2008

నువ్వెవరో...?


నిశి రాతిరి చంద్రమా నను దోచిన అందమా
కోవెల్లో దీపమా కావ్యంలో భావమా
కొమ్మ చాటు పుష్పమా కడలిలోని ముత్యమా
తేటగీతి పద్యమా తేనెలో మకరందమా
విరజాజి పుష్పమా వెన్నెలంటి వర్ణమా
పుడమిలోని సంద్రమా పురివిప్పిన మయూరమా
కడలిలోని కెరటమా కదిలేటి శిల్పమా
తెల్లవారు కమలమా తెలుగింటి అందమా
నిన్న రాతిరి స్వప్నమా నా మదిలోని రూపమా!
-రమేష్

ఎవరివో...???


తొలకరి జల్లులోని తన్మయత్వానివో
తొలిపొద్దు వేళలో తామర పువ్వువో

గోదారి అలలపై నర్తిస్తున్న యెంకివో
గున్నమావి కొమ్మలపై కూసె కోయిలవో
చిరుజల్లులో చిందులు వేసె మయూరానివో
చిరుదీపమై వెలుగును పంచె తారకవో
ఎల్లోర శిల్పాలలోని అందానివో
ఎదనుదోచె మృదు మంజరి నాదానివో
సప్త వర్ణాలను నింపుకున్న హరివిల్లువో
సప్త స్వరాలను పలికె వేణువువొ
ఎవరివో......నువ్వెవరివో...
నిన్న రాతిరి స్వప్నానివో
నా మదిని దోచిన అందానివో!!
-రమేష్

Thursday, July 3, 2008

నా పరిస్థితి


రెక్కలు విప్పిన మనసును రెచ్చగొట్టాను
ప్రేమనె ఇంధనం నింపి పక్షిని చేశాను
ఆకాశానికి అర్రులు చాచాను
అందమైన భవితను అణగదొక్కాను
ఊహల లోకంలో ఊయలూగాను
ఈదురు గాలిలో ఊకనయ్యాను
ఆకశంలో తారననుకున్నాను
అనంతంలో బిందువయ్యను
కడలి సంగతి మరిచి పోయాను
కూపస్త మాండుకమై మిగిలిపోయాను
దిక్కులన్ని తిరిగి బిక్కపోయాను
దిక్కు తోచక నేడు మిగిలిపోయాను
కమ్మివేసిన మబ్బుల్ని తేల్చివేశాను
కన్నీటితో నేడు మిగిలిఉన్నాను
-రమేష్