నాకు తెలుగు అంటె చాలా ఇష్టం,తెలుగంటె ఉన్న అభిమానం నేను ఈ చిన్ని కవితలు వ్రాయడానికి కారణం. ఎపుడైన మనస్సు హాయిగ ఉన్నప్పుడు మరియు అపుడప్పుడు బాధ కలిగినప్పుడు అనుభూతిని కవితలుగా వ్రాయడం నా అలవాటు.నా కవితా ప్రస్థానాన్ని మీకోసం.......
Sunday, December 16, 2012
మేఘ సందేశం
తారల్లో వెదికాను తన రూపు కోసమని
జాబిలినడిగాను తన జాడ కోసమని
క్షణాలే యుగాలై గడుస్తున్నాయని
అనుక్షణం తనకోసం తపిస్తున్నానని
ఆశగా ఆమెకై వేచియున్నానని
ఆర్తిగా తనకోసం అలమటిస్తున్నానని
కలల్లో ఆమెనే కలువరిస్తున్నానని
కనుల్లో ఆ రూపే కొలువుంచానని
నిమిషమైన ఇక నే వేగలేనని
నిరీక్షిస్తు తనకై వేసారనని
నీరు లేని చేపనై కుశించానని
మేఘమా చెప్పవా ఈ కబురు తనకు
జాలితో నా బాధ తెలుపు తనతో
-రమేష్
Monday, November 19, 2012
Subscribe to:
Comments (Atom)