నాలో సగం...
నా అడుగులో అడుగై
నా తోడు నీడవై
నా ఆత్మ బంధువయ్యావు
నా కథకి మూలమై
నా కవితకి ప్రేరణై
నా కలలకి రూపమయ్యావు
నా కంటి పాపవై
నా ఇంటి దీపమై
నా ముంగిట్లో ముగ్గైనావు
నా శ్వాసలో శ్వాసవై
నా ప్రాణానికి ప్రాణమై
నా గుండెలో కొలువున్నావు
నా జీవన జ్యోతివై
నా జీవిత గమ్యమై
నాలో సగమై నువ్వున్నావు
-రమేష్
1 comment:
మీ కవితలన్నీ చదివానండి.... మొదటి నంచి ఇప్పటివరకు... కొన్ని మనసుని నిశ్శబ్దం లోకి నెట్టేస్తే...మరికొన్ని ఆశల పల్లకిలో అలరింప చేస్తాయి...మీ మనోభావాలు చాలా బాగా పలికించారండి...మీ హృదయ వీణతో....>
Post a Comment