Sunday, December 16, 2012

నాలో సగం...












 
నా అడుగులో అడుగై
నా తోడు నీడవై
నా ఆత్మ బంధువయ్యావు

నా కథకి మూలమై
నా కవితకి ప్రేరణై
నా కలలకి రూపమయ్యావు

నా కంటి పాపవై
నా ఇంటి దీపమై
నా ముంగిట్లో ముగ్గైనావు

నా శ్వాసలో శ్వాసవై
నా ప్రాణానికి ప్రాణమై
నా గుండెలో కొలువున్నావు

నా జీవన జ్యోతివై
నా జీవిత గమ్యమై
నాలో సగమై నువ్వున్నావు
-రమేష్

మేఘ సందేశం


















తారల్లో వెదికాను తన రూపు కోసమని
జాబిలినడిగాను తన జాడ కోసమని
క్షణాలే యుగాలై గడుస్తున్నాయని
అనుక్షణం తనకోసం తపిస్తున్నానని
ఆశగా ఆమెకై వేచియున్నానని
ఆర్తిగా తనకోసం అలమటిస్తున్నానని
కలల్లో ఆమెనే కలువరిస్తున్నానని 
కనుల్లో ఆ రూపే కొలువుంచానని
నిమిషమైన ఇక నే వేగలేనని
నిరీక్షిస్తు తనకై వేసారనని
నీరు లేని చేపనై కుశించానని
మేఘమా చెప్పవా ఈ కబురు తనకు
జాలితో నా బాధ తెలుపు తనతో
-రమేష్