Wednesday, July 30, 2008

నువ్వెవరో...?


నిశి రాతిరి చంద్రమా నను దోచిన అందమా
కోవెల్లో దీపమా కావ్యంలో భావమా
కొమ్మ చాటు పుష్పమా కడలిలోని ముత్యమా
తేటగీతి పద్యమా తేనెలో మకరందమా
విరజాజి పుష్పమా వెన్నెలంటి వర్ణమా
పుడమిలోని సంద్రమా పురివిప్పిన మయూరమా
కడలిలోని కెరటమా కదిలేటి శిల్పమా
తెల్లవారు కమలమా తెలుగింటి అందమా
నిన్న రాతిరి స్వప్నమా నా మదిలోని రూపమా!
-రమేష్

ఎవరివో...???


తొలకరి జల్లులోని తన్మయత్వానివో
తొలిపొద్దు వేళలో తామర పువ్వువో

గోదారి అలలపై నర్తిస్తున్న యెంకివో
గున్నమావి కొమ్మలపై కూసె కోయిలవో
చిరుజల్లులో చిందులు వేసె మయూరానివో
చిరుదీపమై వెలుగును పంచె తారకవో
ఎల్లోర శిల్పాలలోని అందానివో
ఎదనుదోచె మృదు మంజరి నాదానివో
సప్త వర్ణాలను నింపుకున్న హరివిల్లువో
సప్త స్వరాలను పలికె వేణువువొ
ఎవరివో......నువ్వెవరివో...
నిన్న రాతిరి స్వప్నానివో
నా మదిని దోచిన అందానివో!!
-రమేష్

Thursday, July 3, 2008

నా పరిస్థితి


రెక్కలు విప్పిన మనసును రెచ్చగొట్టాను
ప్రేమనె ఇంధనం నింపి పక్షిని చేశాను
ఆకాశానికి అర్రులు చాచాను
అందమైన భవితను అణగదొక్కాను
ఊహల లోకంలో ఊయలూగాను
ఈదురు గాలిలో ఊకనయ్యాను
ఆకశంలో తారననుకున్నాను
అనంతంలో బిందువయ్యను
కడలి సంగతి మరిచి పోయాను
కూపస్త మాండుకమై మిగిలిపోయాను
దిక్కులన్ని తిరిగి బిక్కపోయాను
దిక్కు తోచక నేడు మిగిలిపోయాను
కమ్మివేసిన మబ్బుల్ని తేల్చివేశాను
కన్నీటితో నేడు మిగిలిఉన్నాను
-రమేష్

Thursday, June 5, 2008

నివేదన...


ఓ ప్రేయసీ ప్రియసఖి నా ప్రేమ చూడవె
నినునేను కోరి నను నేను మరిచానె
మదిలోని నీ రూపు మరువ లేకున్నానె
యెదలోని నా ప్రేమ యెటుల నే తెలుపనె
కలలెన్నో కంటూనె కునుకు రాదాయె
యెదలోని నీ ఊసు మాసిపోదాయె
కవ్వించే నీ చూపు కుచ్చుకుంటుందే
తప్పుకుందామంటె తిప్పలవుతుందే
గుండెలో నీ రూపు గూడుకట్టిందె
గుండేమో ఆ గూడు తీయనంటుందె
మనసేమో నీ తలపు మరవనంటుందె
మనసు తలుపు నిను తెరువమంటుందె
కనులేమో నీ రూపు నెమరు వేస్తున్నాయె
కను పాప నీవై కొలువుండి పోవెమె
గుండెలో ఊసులేవో గుప్పుమంట్టూన్నాయే
పంచడానికి నిను పిలవమంట్టూన్నవె
జోడు కోసం ఈడు గోల పెడుతుందె
మాటేమో కరువై మదన పడుతుందే
ప్రతి రోజు నువులేక ఉండనంటుందె
పాపనై నీ ఒడిని చేరమంటుందే.
-రమేష్

Wednesday, June 4, 2008

నీ స్నేహం...


కన్నీటి సుడిగుండంలో చిక్కుకుని
కలత చెందినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

ధైన్యంలొ కూరుకొని
దీనంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

చీకటంత అలుముకుని
శూన్యంగ మిగిలినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

గాయాలకు తాలలేక
గమ్యాన్ని మరిచినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

మౌనంలొ మునిగిపోయి
మదన పడినప్పుడు
నేనున్నాను పదమంటు
నన్ను నడిపించిన నేస్తం
నీ స్నేహం నా పాలిట వరం.

ఎన్నని చెప్పను నేస్తం....
నన్ను నడిపిన నీ గూర్చి
తెలుసా నేస్తం.... నీ స్నేహం నా పాలిట వరం.
-రమేష్

Friday, May 16, 2008

నువ్వుంటె...



నువు లేని ప్రతి క్షణం నాకో యుగం
నువ్వుంటె అనుక్షణం నాదె ఈ జగం
నువు లేని ఒక నిమిషం నాకెంతొ ఖేదం
నువ్వుంటె ప్రతి నిమిషం నాకెంతొ మోదం
నువు లేని ఈ లోకం నాకిక సూన్యం
నువ్వుంటె ఈ లొకం నాదె సర్వం
నువు లేని ఎందరొ నాకిక వ్యర్థం
నువ్వుంటె ముందర నాకో అర్థం
-రమేష్

Monday, April 21, 2008

నీ తోడుకై....!!


దారి తెలియని నావ నేను
దరి లాగ నువ్వు రావ!

తడి ఆరిన పుడమి నేను
తొలకరిల నువ్వు రావ!
వేచి యున్న రేయి నేను

వేకువై నువ్వు రావ!
వాడి పోయిన మోడు నేను
వసంత మై నువ్వు రావ!
చెలిమి లేని గోరింక నేను
చిలకవై తోడు రావ!
-రమేష్