Tuesday, December 31, 2013

వృద్ధులు














చావుకేమొ చేరువై
కన్నబిడ్డలకు భారమై
వారి ప్రేమకు దూరమై
కుములుతాము వృద్ధులై

వారి మనసులు క్రూరమై
తరిమేస్తె మూర్ఖులై
బుక్కడంత కూడుకై
అలమటిస్తిమి ఆకలై

కుక్క నాడు చేరువై
వారితో పాటు పెద్దదై
నమ్మకానికి రూపమై
చెంతనుంది ఆప్తుడై

బిడ్డలని పెంచడమే పాపమై
భిక్షాటన మాకు మార్గమై
బ్రతుకే మాకు భారమై
బాధపడితిమి ఒంటరై

కంటిచూపు పలచనై
కర్ర మాకు సాయమై
నడిపించును నేస్తమై
అవసానంలో ఆప్తుడై

నేడు మాకు చీకటై
రేపు మాకు శూన్యమై
మనుగడే మాకు కష్టమై
అలమటిస్తిమి సేదకై

కన్నబిడ్డల ప్రేమకై
వారి పిల్లల పిలుపుకై
ఆదరించే చేతికై
ఆశపడితిమి ఒంటరై

-రమేష్

లక్ష్యం














ఆటంకం కాదేది నీ లక్ష్య సాధనకు
అచంచల ధీక్షతో సాగు ముందుకు!
వరించు విజయం నిన్నే....జయించు లోకం నువ్వే!
ఆపలేదు ఏ ఓటమి నీ అద్భుత విజయాన్ని
అర చేతిని అడ్డుపెట్టి ఆపగలరా సూర్యకాంతి?
కావెన్నడు పరిస్థితులు ప్రతికూలం నీకు
కాకి గూట్లో పుట్టిన కోకిల స్వరం మారునా?
పట్టుదలగా ప్రయత్నిస్తే పరాజయం కలుగునా
ప్రయత్నించి తేలేదా భగీరథుడు గంగని
కష్టపడితే కలగదా కమ్మని విజయం నీకు
కాలేద కఠిన శిల సుందర శిల్పం?
-రమేష్

Sunday, December 16, 2012

నాలో సగం...












 
నా అడుగులో అడుగై
నా తోడు నీడవై
నా ఆత్మ బంధువయ్యావు

నా కథకి మూలమై
నా కవితకి ప్రేరణై
నా కలలకి రూపమయ్యావు

నా కంటి పాపవై
నా ఇంటి దీపమై
నా ముంగిట్లో ముగ్గైనావు

నా శ్వాసలో శ్వాసవై
నా ప్రాణానికి ప్రాణమై
నా గుండెలో కొలువున్నావు

నా జీవన జ్యోతివై
నా జీవిత గమ్యమై
నాలో సగమై నువ్వున్నావు
-రమేష్

మేఘ సందేశం


















తారల్లో వెదికాను తన రూపు కోసమని
జాబిలినడిగాను తన జాడ కోసమని
క్షణాలే యుగాలై గడుస్తున్నాయని
అనుక్షణం తనకోసం తపిస్తున్నానని
ఆశగా ఆమెకై వేచియున్నానని
ఆర్తిగా తనకోసం అలమటిస్తున్నానని
కలల్లో ఆమెనే కలువరిస్తున్నానని 
కనుల్లో ఆ రూపే కొలువుంచానని
నిమిషమైన ఇక నే వేగలేనని
నిరీక్షిస్తు తనకై వేసారనని
నీరు లేని చేపనై కుశించానని
మేఘమా చెప్పవా ఈ కబురు తనకు
జాలితో నా బాధ తెలుపు తనతో
-రమేష్



Monday, November 19, 2012

నువ్వు...

 
ఎద సాగరాన కదిలె అలవు నువ్వు
మది మందిరాన వెలిసిన దేవత నువ్వు
వీనుల తంత్రుల మీటిన వీణవి నువ్వు
స్వర మురళిన పలికిన రాగం నువ్వు
గుండె గుడిలో వెలిగే దీపం నువ్వు
కనుల క్షేత్రాన కదిలే పాపవి నువ్వు
మనో నేత్రాన మెదిలిన రూపం నువ్వు


-రమేష్

Friday, December 30, 2011

భారతీయులం...















తెలివిలేక నాడు మేము
తెల్లవాడికి భానిసయ్యాం
కన్న భూమిని చెరనబెట్టి
కునుకు తీస్తు కూర్చున్నాం
తెల్లవాడికి తొత్తులమై
తల్లి సొత్తును తరలించాం
తెల్లవాడు తంతుంటే
తిరగభాటు నేర్చుకున్నాం
తప్పదని తెల్లోడికెదురుగ
తిరుగుభాటు మొదలు పెట్టాం
తేరుకుని చూసెలోపే
తెల్లవాడికి దోచిపెట్టాం
బిడ్డలందరం ఒక్కటైనాం
భరతమాతే కావలన్నాం
తెల్లవాడిని తరిమికొట్ట
తిప్పలెన్నో మేముపడ్డాం

గడప వీడి పోకముందే
గొడవ పడి వీడిపోయాం
పరాయోడిని పారధ్రోలి
పారతంత్ర్యం మేమొదిలాం
పారతంత్ర్యం వదిలి మేము
పాపతంత్ర్యం పయనమయ్యాం
కటిక చీకటి దారినొదలి
కాళరాత్రి వైపు మల్లాం
పేదరికం పెంచుకుంటు
పసివాడి తీరుగ అడుగులేసాం
మధ్యలో యుద్ధాల పేరుతొ
మా నడ్దిని విరుచుకున్నాం
మానవత్వం మరిచిపోయాం
మావారిని దూరముంచాం
కులం మతం పేరుచెప్పి
కయ్యాలని పెంచుకున్నాం

మాలొమేము తన్నుకుంటు
మూర్ఖులుగా మిగిలున్నాం
రౌడీలమే రాజులుగా
రాజ్యమేలుట మొదలెట్టాం
అక్రమాలకు ఆనవాలై
అవినీతికి నెలువయ్యాం
అప్పులేమొ పెంచుకుంటూ
అభివృద్ధిని జపం చేసాం
సంస్కరణల పేరుతోటి
చావు దెబ్బ మేముతిన్నాం
పల్లెటూలని కాళరాస్తు
పట్టణాలని ముస్తాబు చేశాం
జనాభాని పెంచుకుంటు
జగతిలోనా ద్వితియగున్నాం
తల్లి భారతి ప్రగతికేమో
తల కొరివి మేముపెట్టాం

-రమేష్

Friday, November 25, 2011

ప్రత్తి రైతు




చెర్నాకోల చేతి నుంది
చద్దిమూట భుజానుంది
చిక్కిపోయి దేహముంది
చావుకల మొహానుంది

బీడుపడి పొలముంది
బిక్కమొహం రైతుకుంది
బ్రతుకు భారమయ్యింది
భాదేమొ పెరిగింది

మబ్బుపట్టి మేఘముంది
మంచు గాలి తాకింది
మబ్బు కరిగి పొయింది
మంచి వాన కురిసింది

రైతు మనసు మురిసింది
రాత్రి నిద్ర పట్టింది
రేయి గడిచి పొయింది
రేపటెలుగు వచ్చింది

హలం తను కదిలింది
హోరెత్తి దున్నింది
హడావిడె పెరిగింది
హాయితొ పుడమి మురుసింది

ప్రత్తి మొలకెత్తింది
పరువు నిలుపుతానంది
పచ్చగానె పైరుంది
పంటమీదె ఆశుంది

చినుకు కరువాయింది
చిన్న బావి ఎండింది
చేను వాడి పోయింది
చింతేమొ మిగిలింది

ఆడ పిల్ల ఎదిగింది
అమ్మేమొ మూల్గుతుంది
అయ్య చేసినప్పుంది
అప్పేమొ పెరుగుతుంది

పరువు పేచి పెట్టింది
పిల్ల పెళ్ళి ముందరుంది
పైసకూడ పుట్టకుంది
పుట్టెడంత భాదుంది

పైరుకేమొ పురుగుంది
పంట చేతి కందనంది
పురుగు మందు చెంత నుంది
ప్రత్తి రైతు శవముంది
-రమేష్

Saturday, November 20, 2010

నీ తోడుగా....




నా తోడె నువ్వంట
నీ నీడే నేనంట
నీ వెంటే నేనుంట
ఏ జన్మకు వీడనంట
మొదలు గాని ఏ తంట
లెక్కచేయ నేనంట
నా ప్రెమే నిజమంట
నీ చెంతే నేనుంట
నా ప్రాణం నువ్వంట
ఈ బంధం వీడనంట
మ్రోగిన ఆ గుడి గంట
మన ప్రేమకు సాక్షంట
కలకాలం తొడుంట
కౌగిలిలో కొలువుంట
పండాలి కలల పంట
కావలి మనం జంట
-రమేష్

Tuesday, November 16, 2010

నువ్వు లేక....



నిను విడిచి ఉండగలన ఒక నిమిశమైన
నీ జతను వీడగలన ఏ జన్మకైన
నిను చూడకుండ నేను రెప్ప వేయగలన
నీ ఊసు లేక నేను శ్వాస తీయగలన
నిను మరవలేను నేను మరల జన్మకైన
నీ తోడు వీడిపొను వేయి జన్మలైన
నిను చేరలేక నేను నిమిశముండగలన
నీ చెలిమి లేక నేను చావు కోరుకోన
-రమేష్

Wednesday, July 30, 2008

నువ్వెవరో...?


నిశి రాతిరి చంద్రమా నను దోచిన అందమా
కోవెల్లో దీపమా కావ్యంలో భావమా
కొమ్మ చాటు పుష్పమా కడలిలోని ముత్యమా
తేటగీతి పద్యమా తేనెలో మకరందమా
విరజాజి పుష్పమా వెన్నెలంటి వర్ణమా
పుడమిలోని సంద్రమా పురివిప్పిన మయూరమా
కడలిలోని కెరటమా కదిలేటి శిల్పమా
తెల్లవారు కమలమా తెలుగింటి అందమా
నిన్న రాతిరి స్వప్నమా నా మదిలోని రూపమా!
-రమేష్